Monday, June 5, 2017

మా యింటికి రావోయి మాధవా

మా యింటికి రావోయి మాధవా, నీ
మాయలెల్లాఁ గంటి మిదె మాధవా // పల్లవి //

మచ్చు చల్లేవు వలపు మాధవా
మచ్చిక లెల్లాఁ జేసితి మాధవా
మచ్చెము నీపై నిదె మాధవా యింక
మచ్చరపు చూపు నెల్లాఁ మాధవా // మాయిం //

మఱుఁ గేల యిక నీకు మాధవా
మఱి నాకు దక్కితివి మాధవా
మఱచేవానిచేఁతలు మాధవా మాతో
మఱచు మంటే మనేవు మాధవా // మాయిం //

మట్టులేని శ్రీవేంకట మాధవా కట్టు
మట్టుతో మమ్ముఁ గూడితి మాధవా
మట్టేవు మా కాళ్లప్పట్టి మాధవా
మట్టె లియ్యఁ గద వోయి మాధవా // మాయిం //

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...