మధురా భాషిని మంజుల రూపిణి, అంబర వేణి వీణాపాణి
కాపాడగదె కమలజు రాణి, కరుణింప గదే జ్ఞానతరంగిని
సాహిత్యము నీ సుందర రూపము, సంగీతము నీ సుందర హాసము
అజ్ఞాన అంధ వినాశ కారిణి, ఆదరింపు మము రిపు సంహారిణి -- మధుర భాషిని --
ఓంకారము నీ నాద స్వరూపము, హ్రీంకారము నీ శక్తి స్వరూపము
పంకజ నాభుని కోడలా మము, పాలింపగదే పరమపు రాణి,
వాణి నీ పారాణి పాదముల, ప్రణవిల్లెదవొ వాణి రూపమది,
వీణను మీటుతూ చిరు నగవులతో, వెంచేయ గదే వేద సరస్వతి -- మధుర భాషిని --
No comments:
Post a Comment