Thursday, June 1, 2017

కరుణించి మము బ్రోవరా, మహాదేవా


కరుణించి మము బ్రోవరా, మహాదేవా
కనులార కనిపించరా, మహాదేవా
కలనైన కనిపించరా -- కరుణించి --

ఏ నామమున నిన్ను పిలవాలి ఓ దేవా,
ఏ రూపమున నిన్ను కొలవాలి నా తండ్రి,
నామరూపము లేదుగా, మహాదేవా
నాశం అసలే లేదుగా, మహాదేవా -- కరుణించి--

ముక్కోటి దేవతల మూలము నీవయ్య,
ముక్తికి మార్గంబు నీ నామ స్మరణయ్య -
ఆది అంత్యము నీవేగా మహాదేవా
అంతటా ఉన్నావుగా మహాదేవా -- కరుణించి --

పాపాల కుపంబు, మానవ జన్మంబు,
జన్మనిచ్చిన తండ్రి, జ్ఞానం ఈయగ లేవా
ఆది అంత్యము నీవేగా మహాదేవా
అది తెలియకున్నాముగా మహాదేవా -- కరుణించి --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...