Thursday, June 1, 2017

జై భవాని శంకరాయ చంద్రమౌళి ఏక్రుతాంత


పల్లవి
జై భవాని శంకరాయ చంద్రమౌళి ఏక్రుతాంత
భయ నివారణాయ మాం పాహి మంగళం

అష్ట ముకుట భుజంగ హరమకుట భుషణాయ
ద్రుష్టదాన వాంతకాయ శ్రేష్ఠ మంగళం -- జై --

పరమ పురుష సారంగ పాణియే దిగంబరాయ
నిరతి శయానంద రూప నిత్య మంగళం -- జై --

వామ దేవాయ పంచ వదన కమల శోభితాయ
సోమ సుర్యాగ్ని నేత్ర శుభద మంగళం -- జై --

విమల ముని రూడితాయ వేదవేదాంగ వేద్య
కమల నాభ పూజితాయ రమణ మంగళం -- జై --

వ్యాఘ్ర చర్మ ధారణాయ వాసుకి భుషణాయ
నీల లోహితాయ నీకు నిత్య మంగళం -- జై --

రుద్రాక్ష మాల భూషితాయ రూడ సింహసనాయ
వృషభ వాహనాయ నీకు రూడి మంగళం -- జై --

కాని వస్త్ర ధారణాయ యోగి దండ భూషణాయ
కామితార్ధ ఫల ప్రదాయ స్వామి మంగళం -- జై --

స్పటిక లింగ ధారణాయ శైలజా మనోహరాయ
సర్వ జగద్రక్షకాయ స్వామి మంగళం -- జై --

భుతనాథ ధర యానాం పురమునా వెలసినావు
గౌతమీ తీర వాస కలయ మంగళం -- జై --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...