Thursday, June 1, 2017

శేషశైలా వాసా, శ్రీ వేంకటేశా

శేషశైలా వాసా, శ్రీ వేంకటేశా
శయనించు మా అయ్యా , శ్రీ చిద్విలాసా
శేషశైలా వాసా, శ్రీ వేంకటేశా

శ్రీదేవి వంకకు, చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుక రానీయకు --శ్రీదేవి --
ముద్దు సతులిద్దరిని ఇరు వైపులా జేర్చి
మురిపించి లాలించి ముచ్చటల తేల్చి --శేషశైలా--

పట్టు పానుపు పైనా, పవళించరా స్వామి
భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడా
చిరు నగవు లొలుకుచు నిదురించు నీ మోము
కరువు తీరా గాంచి, తరియింతుము మేము --శేషశైలా --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...