మనసున నీ నామమేరా
మనసున నీ నామమేరా నా కన్నుల నీ రూపమేరా
ఆపదలలో నీకు అందించు మా సిరులు
ఆ సిరులలో నీకు అతి ప్రీతీ మా కురులు
ఆడుకోమనగానే అందించు నీ కరము,
అతి లోక సుందరమూ మణిమయ భూశితము -- మనసున --
కలిలోన నీవే కనిపించు దైవము
పిలిచినా పలికే ప్రేమాస్పడుడవు
కావగా రావేల జాగేల నయ్య
అలివేలు మంగమ్మ అనుమతి కావలెనా -- మనసున --
No comments:
Post a Comment