Tuesday, June 6, 2017

తోడి : దయచూడుమయా తిరుమలానిలయా

తోడి : దయచూడుమయా  తిరుమలనిలయా 


దయచూడుమయా   తిరుమలానిలయా
భక్తుల మొరవిని       పాలింపుమయా

1. ఏడుకొండల పైన ఏ త్రోవ నున్నావో
ముడుపులు తెచ్చాను కన్నతండ్రి నీకై
అజ్ఞానులము అపరాధము బాపి
ఆదుకోవయ్యా శ్రీ శ్రీనివాసా      !! దయచూడుమయా !!

2. పిలిచిన పలికే స్వామివి నీవని
కలియుగమందున ఘనత గాంచితివి
చల్లని స్వామి శ్రీ వెంకటేశా
మొరవినవేమయ్య  శ్రీ చిద్విలాస    !! దయచూడుమయా !!

3. ఇల వైకుంఠమందు తిరుపతి కొండ
నిత్య కల్యాణాలు నిలయము నీ కొండ
ఆ కొండపై నీవు అలమేలు మంగతో
ఆనందము గుండి మేము మరిచినావా !! దయచూడుమయా !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...