Sunday, June 4, 2017

పున్నాగవరాళి - ఆదిపల్లవి:గంధము పుయ్యరుగా

 పున్నాగవరాళి - ఆదిపల్లవి:గంధము పుయ్యరుగా


గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా
అను పల్లవి:అందమైన యదునందనుపై
కుందరదన లిరవొందగ పరిమళచరణ


(1):తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కలకలమను ముఖకళగని సొక్కుచు బలుకుల
నమృతము లొలికెడు స్వామికిచరణ


(2):చేలము గట్టరుగా బంగరు చేలము
గట్టరుగా మాలిమితో గోపాల బాలులతో
నాల మేపిన విశాలనయనునికిచరణ


(3):హారతులెత్తరుగా ముత్యాల హారతు లెత్తరుగా
నారీమణులకు వారము యౌవన వారక
యొసగెడు వారిజాక్షునికిచరణ


(4):పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము రాజిత త్యాగరాజ నుతునికి

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...