Thursday, June 1, 2017

జగముల నేతా భాగ్య విధాతా

జగముల నేతా భాగ్య విధాతా.. శ్రీమన్నారాయణా
స్వామి నమ్మిన వారిని కృపగన రాదా.. శ్రీమన్నారాయణా

ఆ ఆ.. జగముల నేతా భాగ్య విధాతా.. శ్రీమన్నారాయణా
స్వామి నమ్మిన వారిని కృపగన రాదా.. శ్రీమన్నారాయణా
చరణం 1 :
క్రూరులపైబడి కూల్తువుగాకా.. శ్రీమన్నారాయణా
ఇలను ఋషులను గాంచి దీవించరాగా.. శ్రీమన్నారాయణా
దుష్టుల శిక్షించు లోకవిజేతా.. శ్రీమన్నారాయణా
నీవు శిష్టుల రక్షించు పావనచరితా.. శ్రీమన్నారాయణా..!! జగముల నేతా భాగ్య విధాతా!!
చరణం 2 :
పురువిని మహిషి దుర్భర చరియలు కనలేవూ తండ్రీ
దాని దున్మగ మనిషిగ పుట్టితివయ్యా.. శ్రీమన్నారాయణా
జీవులే నీదు సృష్టి అనునది మరచితివో దేవా
ఆ దివ్య మునులను కాపాడుటకై వెడలేవో తండ్రీ.. !! జగముల నేతా భాగ్య విధాతా!!
చరణం 3 :
సృష్టి అంత నీ రక్షణ లేకా విధ్వన్సం కాదా
ఇల దుష్టుల కూర్చూ శిష్టుల బ్రోచూ జగదీశ్వర దేవా
అనంత శయనం మందున తేలుచు ఇనవో జగద్పితా..
ఘోరాపదలందున కుమిలే దీనుల కావము పరామత్మా.. !! జగముల నేతా భాగ్య విధాతా!!
చరణం 4 :
సకల మానవుల గళములే విజయ శంఖం పూరింతూ
హరిహరిహరి అని దిజ్వులు వేడగా పోరున విహరించు
రియతు కంపించ భూమి తలదించ విజయం సాధించూ
ఈ పలువుల క్రౌర్యం పుడమిన పాపం నేడే నశియించు
శ్రీమన్నారాయణా... శ్రీపతి జగన్నాధా...
వినవో జగద్పితా... దయగలవో పరమాత్మా..ఆ ఆ

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...