Thursday, June 1, 2017

శరణు శరణు సురేంద్ర సన్నుత


శరణు శరణు సురేంద్ర సన్నుత
శరణు శ్రీ సతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహార
శరణు వేంకట నాయకా

కమల ధరుడును, కమల మిత్రుడు
కమల శత్రుడు , పుత్రుడు
క్షమముతో మీ కొలువుకిప్పుడు
కాచినా రెచ్చరికయా || శరణు శరణు ||

అనిమిషేంద్రులు మునులు దిక్పతులు
అమర కిన్నెర సిద్దులు
ఘనతతో రంభాది కాంతలు
కాచినా రెచ్చరికయా || శరణు శరణు ||

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు
నిన్ను కొలువగ వచ్చిరి
విన్నపము వినవయ్య
తిరుపతి వేంకటాచల నాయకా || శరణు శరణు ||

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...