Saturday, June 10, 2017

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం 
తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము||

మీరిన కాలుని దూతల పాలిటి
మృత్యువు యని నమ్మకయున్న ||తారక మంత్రము||

మచ్చికతో నితరాంతరమ్ముల
మాయలలో పడబోకన్నా
హెచ్చుగ నూట యెనిమిది తిరుపతు
లెలమి తిరుగ పనిలేదన్నా ||తారక మంత్రము||

ముచ్చటగా తా పుణ్యనదులలో
మునుగుట పని ఏమిటికన్నా
వచ్చెడి పరువపు దినములలో
సుడి వడుటలు మానకయున్న ||తారక మంత్రము||

ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన
ఏకో నారాయణుడన్న
అన్ని రూపులై యున్న పరాత్పరు
నా మహాత్ముని కథ విన్నా ||తారక మంత్రము||

ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన
యీ జన్మముతో విడునన్నా
అన్నిటి కిది కడసారి జన్మము
సత్యంబిక పుట్టుట సున్నా ||తారక మంత్రము||

నిర్మల అంతర్లక్ష్య భావమున
నిత్యానందముతో నున్న
కర్మంబులు విడి మోక్ష పద్ధతిని
కన్నులనే జూచుచునున్న ||తారక మంత్రము||

ధర్మము తప్పక భద్రాద్రీశుని
తన మదిలో నమ్ముకయున్న
మర్మము తెలిసిన రామదాసు హృ
న్మందిరమున నే యున్న ||తారక మంత్రము||

సాంఘిక పద్యములు-హరిచ్చంద్ర డ్రామా స్టైల్

తోడి :ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలిన్‌  
కన్నుల్‌ మోడ్చిన మందభాగ్యుడొకడైనన్‌ లేచి రాడక్కటా 
ఎన్నాళ్ళీ చలనంబు లేని శయనం బేతల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కం బిందు పాషాణముల్‌
ఎన్నో ఏండ్లు గడించి దాచినవి అన్నీ స్టాకు మార్కెట్టులో
నిన్నా మొన్నటి దెబ్బతో తరిగి తన్నేశాయి బాల్చీలనే
ఎన్నాళ్ళీ తలకిందులైన పయనం బేజీవు లల్లాడిరో
కన్నీళ్ళే గతిగా చితిన్‌ రగులు టెక్నా స్టాకులున్నందుకున్‌
ఆకాశంబున కారుమబ్బు గములాహారించె దెయ్యాలతో
ఘూకమ్ముల్‌ చెరలాడసాగినవి వ్యాఘోషించె నల్దిక్కులన్‌
కాకోలమ్ములు గుండె జల్లు మనుచున్నంగాని ఇక్కాటియం
దాకల్లాడిన జాడ లేదిచట సౌఖ్యంబెంత క్రీడించునో
స్టాకానందము పోయి నీరసము వేసారించె; మార్జిన్లలో
ఆకాశాన చరించు షేర్లు కొని అల్లాడేటి దౌర్భాగ్యులన్‌
ఘూకమ్ముల్‌ పరికించుచున్నయవి; వ్యాఘోషించె నల్దిక్కులన్‌
బ్రోకర్‌ కాకులు కర్కశ స్వర మహా భూతాల్‌ పిశాచాలుగా
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము నిప్పులలోన కరిగిపోయె
ఇచ్చోటనే భూములేలు రాజన్యుని
అధికార ముద్రిక లంతరించె
ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూ
సల సౌరు గంగలో కలిసిపోయె
ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికం గన్న
చిత్రలేఖకుని కుంచియ నశించె
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు
ఇది మరణదూత తీక్షణ దృక్కులొలయ
అవనిపాలించు భస్మ సింహాసనంబు
ఇచ్చోటనే బీటుబీ వీర స్టాకులు
నీలిగి గుట్టలై నేలరాలె
ఇచ్చోటనే మేటి హీరోలుగా ఉన్న
మైక్రొసాఫ్ట్‌ యాహూలు మట్టిగరిచె
ఇచ్చోటనే పట్టలేని ఇంటర్నెట్టు
ఐపీవొ మ్యాజిక్కు లంతరించె
ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికంగన్న
క్వాల్‌కాము పరువెల్ల కరిగిపోయె
ఇది శవాలకు నిలయమ్ము; కదలలేక
వెర్రి చూపులు చూసెడు విగతజీవ
బంధుమిత్రుల సత్రమ్ము; భ్రాంతి నుంచి
మేలుకోనట్టి వారికి మేలుకొలుపు

రాగం కామవర్ధిని - శివ శివ శివ అనరాద ఓరీ



శివ శివ శివ అనరాద (త్యాగరాజు, రాగం కామవర్ధిని)

పల్లవి:
శివ శివ శివ అనరాద ఓరీ

అనుపల్లవి:
భవ భయ బాధలననచుకోరాదా

చరణాలు:
కామాదులతెగకోసి పరభామల పరుల ధనముల రోసి
పామరత్వము ఎడబాసీ అతి నేమముతో బిల్వార్చన జేసి

సజ్జన గణముల గాంచి ఓరీ ముజ్జగదీశ్వరులని మతి నెంచి
లజ్జాదుల తోలగించ తన హ్రజ్జలమునను తో పూజించి

అగముల నుతియించి బహు బగులేని భాశలను చలించి
భగవతులలో పోశించి ఓరీ త్యాగరాజ సన్నుతుడని ఎంచి

రాగం శుద్ధ ధన్యాసి - భావములోన భాహ్యములందును




భావములోన (అన్నమయ్య, రాగం శుద్ధ ధన్యాసి)

పల్లవి:
భావములోన భాహ్యములందును గోవింద గోవింద అని కోలువవో మనసా

చరణాలు:
హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు
హరి నామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి హరి అనవో మనస

విశ్ణుని మహిమలే విహిత కర్మములు విశ్ణుని పోగడేడి వేదంబులు
విశ్ణుడోక్కడే విశ్వాంతరాత్ముడు వీశ్ణువు విశ్ణువని వెదకవో మనస

అచ్యుతుడితడే ఆదియు అంత్యము అచ్యుతుడే అసురాంతకుడు
అచ్యుడు శ్రీ వేంకటాద్రీ మీదనితె అచ్యుత అచ్యుత శరణనవో మనస

పున్నాగవరాళి - తవ దాసోహం

తవ దాసోహం ( రాగం పున్నాగవరాళి)
పల్లవి:
తవ దాసోహం తవ దాసోహం తవ దాసోహం దాశరథే
చరణాలు:
వర మృదుభాష విరహితదోష నరవర వేశ దాశరథే
సరసిజనేత్ర పరమపవిత్ర సురపతిమిత్ర దాశరథే
నిన్ను కోరితిర నిరుపమశూర నన్నేలుకోరా దాశరథే
మనవిని వినుమా మరవ సమయమా ఇనకుల ధనమా దాశరథే
ఘనసమనీల మునిజనపాల కనకదుకూల దాశరథే
థర నీవంటి దైవము లేదంటి శరణము కోంటి దాశరథే
ఆగమ వినుత రాగ విరహిత త్యాగరాజనుత దాశరథే

నీలాంబరి : ఉయ్యాలలూగవయ్య శ్రీ రామా



రాగం నీలాంబరి : ఉయ్యాలలూగవయ్య

పల్లవి:
ఉయ్యాలలూగవయ్య శ్రీ రామా

అనుపల్లవి:
సయ్యాట పాటలను సత్సార్వభౌమ

చరణాలు:
కమలజాద్యఖిల సురులు నిను కోలువ
విమలులైన మునీంద్రులు ద్యానింప
కమనీయ భాగవతులు గుణ కీర్తనములు నాలాపంబుల సేయగ

నారదాదులు మెరయూచూ స్తుతియింప
సారములు బాగా వినుచూ నీన్ను
నమ్మువారల సదా బ్రోచుచూ వేద సార సఫలను జూచుచూ శ్రీ రామ

నవ మోహనాంగులైన సురసతులు వివరముగ పాడగ నీ భాగ్యమా
నవరత్న మంటపమున త్యాగరాజ వినుతాకృతీ బూనిన శ్రీ రామ

భూపాళం - మిన్నక వేసాలుమాని



భూపాళం ::: రాగం

పల్లవి::

మిన్నక వేసాలుమాని మేలుకోవయ్యా
సన్నల నీయోగనిద్ర చాలు మేలుకోవయ్యా

చరణం::1

ఆవులు పేయలకుఁగా నఱచీఁ బిదుకవలె
గోవిందుఁడ యింక మేలుకొనవయ్యా
ఆవలీవలిపడుచు లాటలు మరగివచ్చి
త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా

చరణం::2

వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడఁ
గూడియున్నా రిదే మేలుకొనవయ్యా
తోడనే యశోద గిన్నెతోఁ బెరుగు వంటకము
యీడకుఁ దెచ్చిపెట్టె నిఁక మేలుకోవయ్యా

చరణం::3

పిలిచీ నందగోపుఁడు పేరుకొని యదె కన్నుఁ-
గొలుకులు విచ్చి మేలుకొనవయ్యా
అలరిన శ్రీవేంకటాద్రిమీఁది బాలకృష్ణ
యిల మామాటలు వింటి విఁక మేలుకోవయ్యా

కల్యాణి : ఎవ్వని వాకిట నిభమద

కల్యాణి : నర్తన శాల సినిమా

సీ.  ఎవ్వని వాకిట నిభమద పంకంబు
            రాజభూషణ రజో రాజి నడఁగు
      ఎవ్వని చారిత్ర మెల్ల లోకములకు
            నొజ్జయై వినయంబు నొరపు గఱపు
      నెవ్వని కడకంటి నివ్వటిల్లెడు చూడ్కి
            మానిత సంపద లీనుచుండు
      నెవ్వని గుణలత లేడు వారాసుల
            కడపటి కొండపైఁ గలయ బ్రాఁకు
తే.  నతడు భూరిప్రతాప, మహా ప్రదీప
      దూర విఘటిత గర్వాంధకార వైరి
      వీర కోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రి
      తలుఁడు కేవల మర్త్యుఁడే ధర్మసుతుడు

హంసధ్వని : వందేహం జగద్వల్లభం

హంసధ్వని :


వందేహం జగద్వల్లభం దుర్లభం
మందర ధరం గురుం మాధవం భూధవం

నర హరిం మురహరం నారాయణం పరం
హరిం అచ్యుతం ఘన విహంగ వాహనం
పురుషోత్తమం పరం పుండరీకేక్షణం
కరుణాభరణం కలయామి శరణం


నంద నిజ నందనం, నందక గదా ధరం
ఇందిరా నాధ మరవింద నాభం
ఇందు రవి లోచనం హిత దాస పదం
ము-కుందం యదు కులం గోప గోవిందం


రామ నామం యజ్ఞ రక్షణం లక్షణం
వామనం కామితం వాసు దేవం
శ్రీ మదావాసినం శ్రీ వెంకటేశ్వరం
శ్యామలం కోమలం శాంతమూర్తిం

హంస ధ్వని - అభీష్ట వరద శ్రీ మహా

రాగం: హంస ధ్వని ;

ఆరోహణ: స - రి 2 - గ3 - ఫ - ని3 - శ ;
అవరోహణ: స - ని 3 - ప - గ 3 - రి 2 - స ;


అభీష్ట వరద శ్రీ మహా గణపతే ఆగమ
వేదాంత్యంతరహిత పతే || అభీష్ట ||


(అనుపల్లవి ):


కవీంద్ర రవి వినుత
కనక మయ దివ్య చరణ
కమలములు నమ్మితిని ||అభీష్ట ||


(చరణం ) :


ముక్తి మార్గమునకు మొదటి దైవము
నీ శక్తి సుముఖత భక్తులగు వారికి
సిద్ధి బుద్ధి వర ఫలము నొసగిన
సద్గురు శ్రీ త్యాగ రాజు పొగడిన ||అబీష్ట ||

బౌళ : నమో నమో రఘుకుల


బౌళ
పల్లవి:
నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య
నమో నమో శంకర నగజానుత

చరణములు:
విహితధర్మపాలక వీరదశరథరామ
గహనవాసినీ తాటకామర్దన-
అహల్యా శాపమోచన అసురకులభంజన
సహజ విశ్వామిత్ర సవనరక్షకా
హరకోదండహర సీతాంగనావల్లభ
ఖరదూషణారి వాలిగర్వాపహా
తరణితనూజాది తరుచరపాలక
శరధిలంఘనకృత సౌమిత్రిసమేతా
బిరుద రావణ శిరోభేదక విభీషణ
వరద సాకేత పురవాస రాఘవ
నిరుపమ శ్రీవేంకటనిలయ నిజ సకల
పురవర విహార పుండరీకాక్షా

Tuesday, June 6, 2017

శ్రీ రామ జయరామ సీతారామ



శ్రీ రామ జయరామ సీతారామ
శ్రీ రామ జయరామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీ రామ జయరామ సీతారామ


నీ దివ్య నామం మధురాతిమధురం
నేనెన్న తరమా నీ నామ మహిమ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీ రామ జయరామ సీతారామ

చరణం:1

చరణాలు కొలిచే నగుమోము చూచే ఆ
చరణాలు కొలిచే నగుమోము జూచే
సామ్రాజ్యమిచ్చావు సాకేతరమా
నీ కీర్తి చాటగా నా కోసమే నీవు
అవతారమెత్తేవు సుగుణాభిరామా
శ్రీ రామ జయరామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీ రామ జయరామ సీతారామ

చరణం:2

నిలకడలేని అల కోతి మూకచే
నిలకడలేని అల కోతి మూకచే
కడలిపై వారధి కట్టించినావే
పెను కడలిపై వారధి కట్టించినావే
నీపేరు జపియించ తీరేను కోర్కెలు
నీపేరు జపియించ తీరేను కోర్కెలు
నేనెంత నుతియింతు నా భాగ్య గరిమ

శ్రీ రామ జయరామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీ రామ జయరామ సీతారామ

రావయ్యా రావయ్యా హనుమా

రావయ్యా రావయ్యా హనుమా
రామయ్య కీర్తన మనసార వినుమా
రామ నామము పలక సంశెయాల మనసు
సంశెయాల మర్మమేమో రామునికే తెలుసు
దారి చిక్కని మనసు మనవి వినుమా
రావయ్యా రావయ్యా హనుమా

కరుడుకట్టిన మనసు ఎన్నడు పల్కునో రామయని
కర్మపాశములు ఎన్నడు వీడునో శెలవుయని
పలికించెడి వాడు పలుకకుండే కిమ్మని
పరుగిడి వచ్చేనేమో నీవునూ ఉన్నావని

రావయ్యా రావయ్యా హనుమా
రామ కీర్తన పల్కించ మా మనవి వినుమా

కనులుండి కనలేను కమనీయ రూపము
ఎలా పొందితినో ఈ ఘోర శాపము
ఎప్పుడు చేసితినో స్వామిని చేరనియ్యని పాపము
నువ్వుండ దొరకునేమో నే కోరిన వరము

రావయ్యా రావయ్యా హనుమా
రాముని రూపము మనసారా కనుమా

కాళీకృష్ణ అని పలికినవారికి

(ప్రేమ యాత్రలకు అను వరుస )

కాళీకృష్ణ అని పలికినవారికి
భాదలు భయమూ ఎందుకు
సాలెపురుగులా  గూటికి చిక్కిన
జీవులందరికి మోక్షము !!కాళీకృష్ణ !!

1. పరమ గురునకు మనకి మధ్యన
అడ్డుగోడయే ఆశరా
ఆ అడ్డుగోడనే ఛేదించినచో
సద్గురు సన్నిధి చేరురా !!కాళీకృష్ణ !!

2. కలిమి లేములు కష్ట సుఖాలు
పగలూ రేయిగా సహజమురా
నాది నాదను అహము విడచిన
సద్గురు సన్నిధి చేరరా !!కాళీకృష్ణ !!

మాల్ కోస్ : ఆదిశేషా అనంతశయనా

మాల్ కోస్ : ఆదిశేషా  అనంతశయనా 

ఆదిశేషా  అనంతశయనా
శ్రీనివాసా శ్రీ వెంకటేశా

1. రఘుకుల తిలక  రఘురామ చంద్ర
సీతాపతే శ్రీ రామచంద్ర  !! ఆదిశేషా !!

2. యడుకుల భూషణ యశోదానందన
రాధిపతే గోపాలకృష్ణ !! ఆదిశేషా !!

3. పన్నగ భూషణ కైలాసవాసా
గౌరిపతే శంభూ శంకర !! ఆదిశేషా !!

4. రాక్షస మర్దన శ్రీ రామ దూతా
అంజని పుత్ర జై వీరహనుమ !! ఆదిశేషా !!

5. వానరవీర వాయుకుమారా
అతిబలవంతా శ్రీ ఆంజనేయా !! ఆదిశేషా !!

హర హర మహాదేవ

చిత్రం: పౌర్ణమి (2006) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల
శంభో శంకర హర హర మహాదేవ (4) తద్ధింతాదిది ధింధిమీ పరుల తాండవకేళీతత్పర గౌరీమంజుల సింజిణీ జతుల లాస్యవినోదవ శంకర భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశ నీలకందరా జాలిపొందరా కరుణతొ ననుగనరా నీలకందరా శైలమందిరా మొరవిని బదులిడరా నగజామనోజ జగదీశ్వరా మాలేందుశేఖరా శంకరా భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశ హర హర మహాదేవ (4) ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... అంతకాంత ఈ సతి అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనదీ... ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తాణువైన ప్రాణధవుని చెంతకు చేరుతున్నదీ... ఆ... ఆ... భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా రసతరంగిణీ లీల యతిని నృత్యరతుని చేయగలిగే ఈ... వేళ భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదముపరేశ జంగమ సావర గంగాచ్యుత శిర భృతమంజులకర పురహరా భక్తశుభంకర భవనా శంకర స్వరహర దక్షాత్వర హరా పాలవిలోచన పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆసుతోష అథనాశ విశాషణ జయగిరీశ బృహదీశ్వరా హర హర మహాదేవ హర హర మహాదేవ వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమపాశమున పిలువంగా యోగివేష నీ మనసున కలగద రాగలేశమైనా హే మహేశ నీ భయదపదాహతి దైత్యశోషణము జరుపంగ భోగిభూష భువనాళిని నిలుపవ అభయముద్రలోన నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాథ శృతివినరా హర హర మహాదేవ

మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ

మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ
మధుర మధుర తర శుభనాముడు..గుణధాముడు
మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ

ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు
ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు
మానవుడై పుట్టి మాధవుడై నాడు..ఆ..

తలచిన వారికి తారకరాముడు
పిలిచిన పలికే చెలికాడు సైబోడు
కోలువై ఉన్నాడు కోదండరాముడు
మన తోడుగా .. నీడగా .. రఘురాముడు

మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ

కడకు బోయను ఆది కవిని చేసిన పేరు
గరళ కంఠుని నోట తరలి వచ్చిన పేరు
ఇహపర సాధనకు ఇరువైన పేరు
శబరి ఎంగిలి గంగా తానమాడిన పేరు
హనుమ ఎదలొ భక్తి ఇనుమడించిన పేరు
రామ రామ అంటే కామికమే తీరు
కలకాలము మమ్ము కాపాడు పేరు

మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ

అక్షయలింగ విభో స్వయంభో

అక్షయలింగ విభో స్వయంభో
ఆలించుమయ్యా సదాశివ శంభో
శరణంటినయ్యా కరుణమూర్తీ
స్మరణీయ జగదంబికా హృదయాళువై
విత్తమ్మునీయవే విజ్ఞానమీయవే
కృత్తివాసా మమ్ము కృతార్థులను శాంతవే
అభయమ్ము దయసేయు మరలవాసా
శుభ పాదమే నమ్మినాను మహేశా
పూమాలవలె అమరియుండు పెనుపావ
ఏ పారగా జటాజూటమున సొగ సోవా
గళమున విషమట - పెదవుల సుధయ
ఇచ్చువాడు తను బిచ్చగాడట
నిలిచియున్నాడ - కొలుచుచున్నాడ
తలచుచున్నాడ - ననుబ్రోవు మన్నివే

రామయ తండ్రి ఓ రామయ తండ్రి

రామయ తండ్రి ఓ రామయ తండ్రి
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటె నువ్వేలే రామయ తండ్రి ||2||

చరణం : 1
తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒకదెబ్బకె ఇరిసావంట ||2||
పరశరాముడంతవోణ్ణి పాలదరిమినావంట
ఆ కతలు సెప్పుతుంటె విని ఒళ్లు మరచి పోతుంట

చరణం : 2
ఆగు బాబు ఆగు
అయ్యా నే వత్తుండ బాబు నే వత్తుండ ||2||
నీ కాలిదుమ్ము సోకి రాయి ఆడది ఐనాదంట
నాకు తెలుసులే
నా నావ మీద కాలు పెడితె ఏమౌతాదోతంట ||2||
దయజూపి ఒక్కసారి కాళ్లు కడగనీయమంట
మూడు మూర్తులా నువ్వు నారాయణ మూర్తివంట

చరణం : 3
అందరినీ దరిజేర్చు మారాజువే
అద్దరినీ జేర్చమని అడుగుతుండావే ||2||
నువు దాటలేక కాదులే రామయతండ్రి ||2||
నన్ను దయ చూడగ వచ్చావు రామయతండ్రి
హైలెస్సా హైలో హైలెస్సా.....

వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె

శ్రీమద్రమారమణ గోవిందో హరి
శ్రీ అకౄరవరద గోవిందో హరి

హరి హరెలొరంగ హరి ... హరెలొరంగ హరి..
వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె
మాపాలి దేవుడైవచ్చాడులే...మామీద దయచూప వచ్చాడులే
వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె

నల్లా నల్ల నివాడు .. నాజూకు వన్నెకాడు
దొంగలాగ నక్కి నక్కి వచ్చాడే
కోకలెత్తుకొని పోయి దాచాడే
పుట్టినపుడు లేనికోక .. గిట్టినపుదు రానికోక
ఇప్పుడింక ఎందుకని చెప్పినాడే ..
అబ్బో మెట్టవేదాంతాలు గుప్పినాడే
వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె

పదారువేల గోపెమ్మలపై మత్తుమందుని చల్లినవాడు
చక్కనైన ఒక చుక్కను చూసి సైయని సైగలు చేశాడు....
పిల్లనగ్రోవిని వూది కులుకుచూ చూపులగాలం వేశాడే...
ముసిముసినవ్వుల ముద్దులాడుచూ రాసక్రీడలు చేశాడే....ఎన్నెన్నో లీలలు చేశాడే
వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె

ఒంటిపాటుగా వున్నాడయ్యా… భయమేలేదను కున్నాడయ్య....
పొంచివేసిన అదురుదెబ్బతో అవతారం చాలించాడయ్యా...
వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె
మాపాలి దేవుడైవచ్చాడులే...మామీద దయచూప వచ్చాడులే
వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె

మోహనరూప గోవిందా మానసచోర గోవిందా
విలాసపురుష గోవిందా విచిత్రవేష గోవిందా
కపటనాటక గోవిందా కన్యాపహార గోవిందా
గోవిందాహరి....గోవిందాహరి....గోవిందా గోవిందాహరి....గోవిందాహరి....గోవిందా

శ్రీమద్రమారమణ గోవిందో హరి.....

ధనమేరా అన్నిటికీ మూలం

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం

మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
మానవుడే ధనమన్నది సృజియించెనురా
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా

ధనమేరా అన్నిటికీ మూలం

ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే

ధనమేరా అన్నిటికీ మూలం

కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం

ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
ధనమేరా అన్నిటికీ మూలం

శ్యామ : విధాత తలపున ప్రభవించినది

శ్యామ : విధాత తలపున ప్రభవించినది

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం...
కనుల కొలనులొ ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం...
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించిపంచి గానం....ఆ ఆ..

సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది...
సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది...
నే పాడిన జీవన గీతం...ఈ గీతం..

విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం....

ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూగ తంత్రులపైన..
జాగృత విహంగ తతులే వినీల గగనపు వెదిక పైన
ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూగ తంత్రులపైన..
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ..
విశ్వకార్యమునకిది భాష్యముగా....

విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం....

జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
జనించు ప్రతిశిశు గల్ళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము నే...

విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం....

నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది...
నేపాడిన జీవన గీతం...ఈ గీతం..

ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే


ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే రామచంద్ర
నన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్ర
చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్ర
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర
భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర
శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్ర
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్ర
లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర
సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర
కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్ర
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర
నీ తండ్రి దశరథ మహరాజు పెట్టెనా రామచంద్ర
లేక నీ మామ జనక మహరాజు పంపెనా రామచంద్ర
అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్ర
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర
భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్ర
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్ర

ఇక నీ పరీక్షకు మేమాగలేము

బాబా ఓ బాబా

ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము

నువులేక అనాథలం
భ్రతుకంతా అయోమయం

బాబా ఓ బాబా

మా పాలి దైవం అని
మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి

మా ఆర్థి చూస్తావని
సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి

శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా
ఏ దైవమైనా ఏ ధర్మమైనా నీలోనే చూచాము సాయి

రావా బాబా రావా రక్షా రక్షా నీవే కదా మా బాబా

నువులేక అనాథలం
భ్రతుకంతా అయోమయం

బాబా ఓ బాబా

మా యేసు నీవేనని మా ప్రభువు నీవేనని
ప్రార్థనలు చేసామయ్య నిన్నే
అల్లాగా వచ్చావని చల్లంగా చూస్తావని
చేసాము సలాం సలాం నీకే
గురునానక్ అయినా గురుగోవిందు అయినా
గురుద్వారమయిన నీద్వారకేనని
నీ భక్తులయినాము సాయి

రావా బాబా రావా రక్షా రక్షా నీవే కదా మా బాబా

నువులేక అనాథలం
భ్రతుకంతా అయోమయం

బాబా ఓ బాబా

ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము

ఎంత మధురమో శ్రీ సాయి నామము

ఎంత మధురమో శ్రీ సాయి నామము
శుభముల లబ్దికి, సంకల్ప సిద్దికి
శిరిడీ నాధు స్మరణమే
ఎంతో మధురము "ఎంత"

జీవాత్మ పరమాత్మల మేలవింపులో
మహిలో మెలిగే మహనీయుడు
బక్తి తత్వములను ప్రభోదించిన
సద్గురుల నులి చరితం ఎంత మధురమో "ఎంత"

మనసులోన మెదిలే భక్తి శ్రద్దలే
మనుగడను తీర్చే మణిదీపాలై
వెలుగు బాటలో మము నడిపించే
సద్గురుల ధుని ఉదయం ఎంత మధురమో "ఎంత"

మా పాపాల తొలగించు

మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య "మా పాపాల"

పసిపాప మనసున్న ప్రతిమనిషిలోను పరమాత్ముడున్నాడని
వాడు పరిశుద్దుడవుతాడని
గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
మమ్ము సాకావు మా సాయి
వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్ని ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
తలపుల్ని తీసేస్తివి, మా కలతలని మాపేస్తివి "మా పాపాల"

పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం
ఇచ్చు మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాదుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్య
వారి బాదల్ని మోసావయ్య

ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో
నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకామాయి నివాసమాయే ధన్యులమయినామయ్య
మాకు దైవామైవెలిసావయ్య "మా పాపాల"

జయంతశ్రీ–దేశాది : మరుగేలరా! ఓ రాఘవా



జయంతశ్రీ–దేశాది

మరుగేలరా! ఓ రాఘవా! IIమరుII

మరుగేల! చరాచర రూప!

పరాత్పర! సూర్య సుధాకర లోచన! IIమరుII

అన్ని నీ వనుచు అంతరంగమున–

తిన్నగా వెదకి తెలిసికొంటినయ్య!

నిన్నె గాని మదినెన్నజూల నొరుల–

నన్ను బ్రోవవయ్య–త్యాగరాజనుత! IIమరుII

అభేరి– నగుమోము కనలేని



అభేరి–ఆది

నగుమోము కనలేని నా జాలి తెలిసి–

నను బ్రోవగరాదా?శ్రీ రఘవర ! నీ IIనగుII

నగరాజధర! నీదు పరివారు లెల్ల

ఓగి బోధన చేసే వారలు కారే! అటులుండుదురే! నీ IIనగుII

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో

గగనానికిలకు బహు దూరంబనినాడో

జగమేలే పరమాత్మ! ఎవరితో మొరలిడుదు

వగజూపకు తాళను నన్నేలుకోరా? త్యాగరాజనుత!(నీ) IIనగుII

రామా రామభద్ర రవివంశరాఘవ



రామా రామభద్ర రవివంశరాఘవ

యేమి యరుదిది నీకింతటివానికిని

చ. 1: నాఁడు రావణు తలలు నఱకిన లావరివి

నేఁడు నాపాపములు ఖండించరాదా

వాఁడిప్రతాపముతోఁడ వారిధిగట్టిన నాటి–

వాఁడవిట్టె నామనోవార్ధిఁ గట్టరాదా

చ. 2: తనిసి కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి

కినిసి నాయింద్రియాల గెలువరాదా

యెనసి హరుని విల్లు యెక్కుపెట్టి వంచితివి

ఘనము నాదుర్గుణము కడు వంచరాదా

చ. 3: సరుస విభీషణుఁడు శరణంటేఁ గాచితివి

గరిమ నే శరణంటిఁ గావరాదా

తొరలి శ్రీవేంకటేశ దొడ్డుగొంచ మెంచనేల

యిరవై లోకహితానకేదైనా నేమీ

రావయ్యా రావయ్యా శ్రీ కాళీక్రిష్ణయ్యా

రావయ్యా రావయ్యా శ్రీ కాళీక్రిష్ణయ్యా 

 రావయ్యా రావయ్యా శ్రీ కాళీక్రిష్ణయ్యా

నీ క్షేత్రమ్మిదియేనయ్యా శ్రీ కాళీక్రిష్ణయ్యా

పుణ్య క్షేత్రమ్మిదియేనయ్యా శ్రీ కాళీక్రిష్ణయ్యా 


1.గోపాలుడవీవయ్యా శ్రీ కాళీక్రిష్ణయ్యా 

గోరుముద్దలున్నవయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

ఆరగింప రావయ్యా శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

ఆనందించెదమయ్యా శ్రీ  కాళీక్రిష్ణయ్యా 


2.క్షీరమెంతొ గలదయ్యా శ్రీ  కాళీక్రిష్ణయ్యా

క్షీరాన్నమె తినవయ్యా శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

వెన్నలారగింపవయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

వెన్నవంటి మనసు నీది శ్రీ  కాళీక్రిష్ణయ్యా

3.ధూప దీపమున్నదయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

నయివేద్యము వున్నదయ్య శ్రీ కాళీక్రిష్ణయ్యా  

వున్నదంత నీదయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

మేమందరం నీవారమయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 


4.వరములేమి కోరమయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

నీ రాక మాకు వరమయ్యా శ్రీ  కాళీక్రిష్ణయ్యా

నిరీక్షించుచుంటిమయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా

నీ సేవ చేసుకొందుమయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

ఏమిపాదము నీదు పాదము దివ్య పాదము

ఏమిపాదము నీదు పాదము దివ్య పాదము

.ఏమిపాదము నీదు పాదము దివ్య పాదము
మహిమలెన్నో మహిన చూపిన మేటి పాదము శ్రీ సాయి పాదము

1.షిరిడి నేలను పుణ్య భూమిగ మార్చినట్టి పాదము
భరత భూమిని భాగ్య శీలగ తీర్చినట్టి పాదము
గంగయమున పుణ్య నదుల ప్రవహింపజేసిన పాదము
భక్త దాస గణాది భక్తుల బ్రోచినది ఈ పాదము 
 
2.కృష్టు వ్యాధి భాగోజీని కాచినట్టి పాదము
కమ్మరి బాలుని అగ్ని నుండి కాపాడిన పాదము
మైనతాయికి ప్రసవ వేదన తీసివేసిన పాదము
గీతార్ధ శ్లోక బోధన చెప్పినట్టి పాదము
 
3.జలముతోనే జ్వలన చేసిన దీపకాంతి పాదము
జ్ఞాన జ్యోతుల వెలుగుతోనే భక్తి చూపిన పాదము
బ్రహ్మ జ్ఞానము బోధించి ముక్తి చూపిన పాదము
నాణెములతో నవవిధ భక్తి తెలిపిన పాదము 
 
4.కులము మతములు యేవి లేవని చెప్పినట్టి పాదము
సమత మమత చూపినట్టి సామరస్య పాదము
సగుణ బ్రహ్మ ఆకారమై వచ్చినట్టి పాదము
అందరి దైవము వోక్కడేనని బోధించిన పాదము 
 
5.ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ద్వాదశ మంత్ర జపము యిచ్చినట్టి పాదము
రామకృష్ణ శివ మారుతి దత్త దేవుని పాదము
అల్లా యేసు నానక్ గోవింద వొక్కటన్న పాదము

చూడాలని వుంది బాబా చూడాలని వుంది

 చూడాలని వుంది బాబా చూడాలని వుంది
షిరిడీలోన బాబా ఓ సాయి బాబా
చూడాలనివుంది నిన్ను చూడాలని వుంది

1. చూపులోన చూపుకలిపి ఒక్కసారి చూడాలని
చక్కనైన మనసుతో తపన చెందుచుంటి నేను

2. పలుకులోన పలుకు కలిపి ఒక్కపలుకు పలకాలని
మనసంతా మధురమైన తలపుతోనుంటి నేను

3. నీపాదాలను స్పృశించి నీరాజనమివ్వాలని
వేదన భరియించలేక వేచి యుంటి నేను

4. నీలోగల చైతన్యము నిత్యము దర్శించాలని
వస్తావు వస్తావని యెదురు చూచుచుంటి నేను

5. చిత్తమునేకాగ్రపరచి నీ చిత్తరువును చూచుచు
హృదయగుహలోన నిన్ను పదిలపరచుకొంటి నేను

శ్రీ రామ జయరామ రమణీయ నామ రఘు రామ

శ్రీ రామ జయరామ రమణీయ నామ రఘు రామ
శ్రీ రామ జయరామ రమణీయ నామ రఘు రామ
రామనవమి చెప్పింది రామ కథాసారం
శ్రీ రామనవమి చెప్పింది రామ కథాసారం
శ్రీ రామనవమి చెప్పింది రామ కథాసారం
ఊరు వాడా సంబరం ఊరు వాడా సంబరం
చిందేసింది అంబరం
రామనవమి జయ రామనవమి
శ్రీ రామ జయరామ రమణీయ నామ రఘు రామ !!

దశరథుని ఇంట రామ రూపమున
కౌసల్య కడుపు పండెను
విశ్వామిత్రుని వెంట దాసరథి విశ్వ శాంతి విలసిల్లెను
పాద ధూళి తో రాయిని రమనిగా మార్చెను మంగళ ధాముడు
శివ ధనువు విరిచి నవ వధువు సీతను చేరెను రాముడు
సాయి .......
ఆ రాముడు కొలిచిన పరమ శివుడవు
పరమేశ్వరవుడవు నీవే సాయి
రామ సాయి రామ సాయి రామ సాయి రామ్
రామ సాయి రామ సాయి రామ సాయి రామ్
రామ రామ రామ రామ రామ రామ రామ
శ్రీ రామనవమి చెప్పింది రామ కథాసారం !!

తండ్రి మాటకే విలువ తెలిపింది దండకారణ్య పయనము
మాయ లేడి తో మలుపు తిరిగింది మాధవ దేవుని ప్రయాణము
వానర సేన లో వారధి కట్టగ వారిది దాటెను నరవరుడు
రణ శిరమున రావను కూల్చి పట్టాభి రాముడాయే రఘు రాముడు
సాయీ ఆ రామ సాయి శ్రీ కృష్ణ సాయి శ్రీ రంగ సాయి వి నీవే సాయి
సకల దేవత సన్నిధి నీవే సమర్ధ సద్గురు షిరిడి సాయి
రామ సాయి రామ సాయి రామ సాయి రామ్
రామ సాయి రామ సాయి రామ సాయి రామ్
రామ రామ రామ రామ రామ రామ రామ
శ్రీ రామనవమి చెప్పింది రామ కథాసారం
ఊరు వాడా సంబరం ఊరు వాడా సంబరం
చిందేసింది అంబరం
రామనవమి జయ రామనవమి
శ్రీ రామ జయరామ రమణీయ నామ రఘు రామ !!

ఓం మహా ప్రాణ దీపం శివం శివం

ఓం   మహా ప్రాణ దీపం శివం శివం మహోంకార రూపం శివం శివం
మహా సూర్య చంద్రాగ్ని నేత్రం పవీత్రం మహా గాడ తిమిరాంత కంసౌరగాత్రం
మహా కాంతి భీజం మహా దివ్య తేజం భవానీ సమేతం భజే మంజునాథం
ఓం ఓం ఓం
నమశంకరాయచ మయస్కరాయచ నమశివయచ శివతరాయచ భవహరయచా
మహా ప్రాణ దీపం శివం శివం భజే మంజునాతం శివం శివం


చరణం 1
అధ్వ్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిద శహృద యంగమం
జతురుదధి సంగమం పంచభూతాత్మకం క్షక్షద్రునాశకం
సప్తస్వరేశ్వరం అష్టశిద్ధీశ్వరం నవరస మనోహరం దశదిశాసునిమలం
ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతిభశంకరం ప్రనతజనకింకరం
దుర్జన భయంకరం సజ్జన శుభంకరం
ప్రాణిభవతారకం ప్రకృతిహిత కారకంభువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం
ఈషం సురేషం వ్రుషేషం పరేషం నటేషం గౌరీషం గణేషం భుతేషం
మహా మధుర పంచాక్షరీ మంత్ర మార్చం మహా హర్ష వర్ష ప్రవర్షంసుశీర్షం
ఓం నమో హరాయచ స్వరహరాయచ పురహరాయచ రుద్రాయచ
భద్రాయచ ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిద్రాయచ
మహా ప్రాణ దీపం శివం శివం భజే మంజునాతం శివం శివం


చరణం 2
డండండ డండండ డండండ డండండ డక్కాని నాదనవ తాండవా డంభరం
తధిమ్మి తక ధిమ్మి ధిధిమ్మి ధిమి ధిమ్మి సంగీత సాహిత్య సుమకమల భంభరం
ఓంకార ఘీంకార శ్రీంకార ఐంకార మంత్ర భీజాక్షరం మంజునాధేశ్వరం
ఋగ్వేదమాద్యం యజుర్వేదవేద్యం సామప్ర దీపం అధర్వప్రభాతం
పురనేతిహస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం వినుద్ధం సుసిద్ధం
నకారం మకారం శ్రికారం వకారం యకారం నిరాకార సాకార సాలం
మహా కాల కాలం మహా నీలకన్ట్టమ్ మహా నంద నందం మహాట్టాట హాసం
ఝాటాఝూట రంగైక గంగా సుఛిత్రం జలద్ఉగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాస్వన్ మహా భాను లింగం
మహాబబ్రువర్ణం సువర్ణం ప్రవర్ణం
సౌరాష్ట్ర సుందరం సోమనాతేశ్వరం శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జైని పుర మహా కాళేశ్వరం వైద్యనాదేశ్వరం మహా భీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశి విశ్వేశ్వరం పరంఘ్రిష్మేశ్వరం త్ర్యంభకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీం కేధారలింగేశ్వరం
అబ్లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం
ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మఖం
అనాధిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
అనాధిం అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మస్తలక్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్తలక్షేత్ర వరపరం జ్యోతిం
ధర్మస్తలక్షేత్ర వరపరం జ్యోతిం ..................ఓం
నమ సోమయచ సౌమ్యాయచ భవ్యయచ భాగ్యాయచ శాంతాయచ సౌర్యాయచ యోగాయచ భోగాయచ కాలాయచ కాంతాయచ రమ్యాయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వాయచ

రేవతి : అల్లా ... శ్రీ రామా... శుభకరుడు సురుచిరుడు

రేవతి : అల్లా ... శ్రీ రామా... 

శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడె వడు
కళ్యాణ గునఘనుడు కరుణా ఘనా ఘనుడు ఎవడు
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీ రామ నామామృతం ఆనామమే దాటించు భవ సాగరం
తాగరా శ్రీ రామ నామామృతం ఆనామమే దాటించు భవ సాగరం

ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలిసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జఘంభుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మలఆర్తి
ఏ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్ర మూర్తి

తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...

పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ శ్రీ రామా
పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా కోదండ రామా
మపనిసరి సానీ పానీపామా సీతారామా
మపనిసరి సా రీ సరిమరిస నిపమా ఆనందరామా
మా ,మా రిమరిమరి సరిమా, రామా జయరామా
సరిమా రామా సపమా రామా
పా ఆ ఆ ఆ వన రామా
ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలాకే వేల్పు
ఏ వేల్పు నిటూర్పు ఇలనునిల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్గు
ఏ వేల్పు నిగమ నిగామలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలనుకల్పు
ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దే మల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కైఒడ్పు

తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...

మాల్ కోస్ : శ్రీ రామ నవమివేళ వాసంత మధుర లీల

మాల్ కోస్ : శ్రీ రామ నవమివేళ  వాసంత మధుర లీల 

 శ్రీ రామ నవమివేళ  వాసంత మధుర లీల
గిరులు తరులు మారేనమ్మా ఉయలై

1.అయోధ్య నందు దశరధరాజుకి
నవమైన ఒక వేళకే
నీలి వర్ణుల  కలువల నేత్రాల
 బాలుడు   జనియించగా ఆ ఆ ఆ

2. రవికుల బాలుడి రూపము చూసి
వెలుగు నిండెనులే
మువ్వురు తల్లుల నిండు హృదయ
మూడు జగములుగా ఆ ఆ ఆ

3. ఆ చిన్న బాలుడు కోదండ రాముడై
గురువుల సమ్మతితో
 జనకుని కూతురు జానకి దేవిని
పరిణయ మాడెను  ఆ ఆ ఆ

శ్రీ సాంబ సదాశివ అక్షరమాలా

శ్రీ సాంబ సదాశివ అక్షరమాలాస్తవః


సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||


అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ (2) | సాంబ |
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ (2) | సాంబ |
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ (2) | సాంబ |
ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ (2) | సాంబ |


ఉరగాదిప్రియ భూషణ శంకర, నరకవినాశ నటేశశివ (2) | సాంబ |
ఊర్జితదానవనాశ పరాత్పర, ఆర్జిత పాపవినాశశివ (2) | సాంబ |
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ (2) | సాంబ |
ౠపమనాది ప్రపంచ విలక్షణ, తాపనివారణ తత్వశివ (2) | సాంబ |


లింగస్వరూప సర్వ బుధప్రియ మంగళ మూర్తి మహేశశివ (2) | సాంబ |
ళూతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియ వేద్యశివ (2) | సాంబ |
ఏకానేక స్వరూప విశ్వేశ్వర లోహిహృదిప్రియ వాసశివ (2) | సాంబ |
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశశివ (2) | సాంబ |


ఓంకారప్రియ ఉరగవిభూషణ, హ్రీంకారాది మహేశశివ (2) | సాంబ |
ఔరసలాలిత అంతకనాశన, గౌరిసమేత గిరీశశివ (2) | సాంబ |
అంబరవాస చిదంబరనాయక, తుంబురునారద సేవ్యశివ (2) | సాంబ |
ఆహారప్రియ ఆదిగిరీశ్వర, భోగాదిప్రియ పూర్ణశివ (2) | సాంబ |


కమలాక్షార్చిత కైలాసప్రియ, కరుణాసాగర కాంతిశివ (2) | సాంబ |
ఖడ్గశూల మృగ ఢక్కాధ్యాయుత, విక్రమరూప విశ్వేశశివ (2) | సాంబ |
గంగాగిరిసుత వల్లభ గుణహిత, శంకరసర్వ జనేశశివ (2) | సాంబ |
ఘాతకభంజన పాతకనాశన, గౌరీసమేత గిరిశశివ (2) | సాంబ |
జ్ఞజ్ఞాశ్రిత శృతిమౌళి విభూషణ, వేదస్వరూప విశ్వేశశివ (2) | సాంబ |


చండ వినాశన సకల జనప్రియ, మండలాధీశ మహేశశివ (2) | సాంబ |
ఛత్రకిరీట సుకుండలశోభిత, పుత్రప్రియ భువనేశశివ (2) | సాంబ |
జన్మజరామృతి నాశనకల్మష, జరహితతాప వినాశశివ (2) | సాంబ |
ఝంకారాశ్రయ భృంగిరిట ప్రియ, ఒంకారేశ మహేశశివ (2) | సాంబ |
జ్ఞానాజ్ఞాన వినాశక నిర్మల, దీనజనప్రియ దీప్తశివ (2) | సాంబ |


టంకాధ్యాయుత ధారణ సత్వర, హ్రీంకారాది సురేశశివ (2) | సాంబ |
ఠంకస్వరూప సహకారోత్తమ, వాగీశ్వర వరదేశశివ (2) | సాంబ |
డంభ వినాశన డిండిమభూషణ, అంబరవాస చిదీశశివ (2) | సాంబ |
ఢంఢం డమరుక ధరణీనిశ్చల, ఢుంఢి వినాయక సేవ్యశివ (2) | సాంబ |
నళిన విలోచన నటనమనోహర, అళికులభూషణ అమృతశివ (2) | సాంబ |


తత్వమసిత్యాది వాక్య స్వరూపగ, నిత్యానంద మహేశశివ (2) | సాంబ |
స్థావరజంగమ భువనవిలక్షణ, భావుక మునివర సేవ్యశివ (2) | సాంబ |
దుఃఖవినాశన దళితమనోన్మన, చందనలేపిత చరణశివ (2) | సాంబ |
ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియ దానశివ (2) | సాంబ |
నానామణిగణ భూషణ నిర్గుణ, నటన జనప్రియ నాట్యశివ (2) | సాంబ |


పన్నగభూషణ పార్వతినాయక, పరమానంద పరేశశివ (2) | సాంబ |
ఫాలవిలోచన భానుకోటి ప్రభ, హాలాహలధర అమృతశివ (2) | సాంబ |
బంధవినాశన బృహదీసామర, స్కందాదిప్రియ కనకశివ (2) | సాంబ |
భస్మవిలేపన భవభయనాశన, విస్మయరూప విశ్వేశశివ (2) | సాంబ |
మన్మథనాశన మధుపానప్రియ, సుందర పర్వతవాసశివ (2) | సాంబ |


యతిజన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్వాది సురేశశివ (2) | సాంబ |
రామేశ్వర రమణీయ ముఖాంబుజ, సోమేశ్వర సుకృతేశశివ (2) | సాంబ |
లంకాధీశ్వర సురగణసేవిత, లావణ్యామృత లసితశివ (2) | సాంబ |
వరదాభయకర వాసుకిభూషణ, వనమాలాది విభూషశివ (2) | సాంబ |


శాంతిస్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతిప్రియ కనకశివ (2) | సాంబ |
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ, షాడ్గుణ్యాది సమేతశివ (2) | సాంబ |
సంసారార్ణవ నాశన శాశ్వత, సాధుహృది ప్రియవాసశివ (2) | సాంబ |
హర పురుషోత్తమ అద్వైతామృత, పూర్ణమురారి సుసేవ్యశివ (2) | సాంబ |
ళాళితభక్త జనేశనిజేశ్వర, కాళినటేశ్వర కామశివ (2) | సాంబ |
క్షరరూపాది ప్రియాన్వితసుందర, సాక్షిజగత్రయ స్వామిశివ (2) | సాంబ |


సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||
సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

గణేశ పంచరత్నం


గణేశ పంచరత్నం
ముదాకరాత మోదకం సదావిముక్తిసాధకం, 
కలాధరావతంసకం విలాసిలోకరక్షకం,

అనాయకైకనాయకం వినాసితేభదైత్యకం, 
నతాసుభాసునాశకం నమామితం వినాయకం ||

నతేతరాతిభీకరం నవోదితార్క భాస్వరం, 
నమత్సురారినిర్జనం నతాధికాపదుద్ధరం,

సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం, 
మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం ||

సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం, 
దరేదరోదరంవరం వరే భవక్త్రమక్షరం,

కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం, 
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం

అకించనార్తిమర్జనం చిరంతనోక్తిభాజనం, 
పురారి పూర్వనందనం సురారిగర్వ చర్వణం,

ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం, 
కపోలదానవారణం భజేపురాణవారణం ||

నితాంతికాంతదంతకాంతిమంతకాంతకాత్మజం, అచింత్యరూపమంతహీనమంతరాయక్రింతనం,

హృదంతరేనిరంతరం వసంతమేవయోగినాం,
తమేకదంతమేవ తం విచింతయామి సంతతం ||

మహాగణేశ పంచరత్న మాదరేన యోన్వహం,
 ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరణ్ గణేశ్వరం,

అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం, 
సమాహితాయురష్ట భూతి మభ్యు పైతి శోచిరాత్ ||

ఆనంద భైరవి : శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా


ఆనంద భైరవి : శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా


శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా, మనసారా స్వామిని కొలిచీ హరతులీరమ్మా || 2 ||

నోచినవారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము || శ్రీ ||

స్వామిని పూజించే చేతులె చేతులట, ఆ ముర్తిని దర్శించే కనులే కన్నులట || 2 ||

తన కథవింటే ఎవ్వరికైనా జన్మ తరయించునట || శ్రీ ||

ఏ వేళైనా, ఏ శుభమైనా, కొలిచే దైవం, ఈ దైవం, ఆ … || శ్రీ ||

అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం….. || శ్రీ ||

అర్చన చేద్దామా మనసు అర్పన చేద్దామా, స్వామికి మదిలోనా కోవెల కడధామా

పధి కాలాలు పసుపు కుంకుమలిమ్మని కోరేమా || శ్రీ ||

మంగళమనరమ్మా జయమంగళమనరమ్మా, కరములు జోడించి శ్రీ నందనమలరంచి,

మంగళమగు శ్రీ సుందరమూర్తికి వందనమనరమ్మా || శ్రీ ||

కళావతి : పిలిచిన పలికేవు తల్లి అమ్మా దుర్గమ్మా

కళావతి : పిలిచిన  పలికేవు తల్లి అమ్మా  దుర్గమ్మా 

పిలిచిన  పలికేవు తల్లి అమ్మా  దుర్గమ్మా
 పిలిచిన  పలికేవు తల్లి

1. కంచిలోన కామాక్షమ్మ
మధురలోన మీనాక్షమ్మ
కలకత్తాలో కాళీమాతా
మము దయచూడుము తల్లీ
అమ్మా దుర్గమ్మా  !!పిలిచిన పలికేవు !!

2. కాండ్రకోట నూకాళమ్మ
పెద్దాపురమున ఓ మరిడమ్మా
లోవలోన తలుపులమ్మా
మము దయచూడుము తల్లీ
అమ్మా దుర్గమ్మా  !!పిలిచిన పలికేవు !!

3. కాంతులు చూపే కన్నులలోనా
కన్నీరే నింపావా
పువ్వులలోన వాసన చూపి
పురుగులు నింపావా   !!పిలిచిన పలికేవు !!

4. మనిషిని చేసి మనస్సు పోసి
మలినమునే  నింపావా
వేడుకచేసి వేదికచేసి
వేదన జేసే వేమి అమ్మ దుర్గమ్మా !!పిలిచిన పలికేవు !!

శృతి నీవు గతి నీవు

శృతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతి (2)
ధృతి నీవు ధ్యుతి నీవు
శరణాగతి నీవు భారతి (2)

నీ పదములొత్తిన పదము ఈ పదము
నిత్య కైవల్య పదము
నీ కొలువు కోరిన తనువు ఈ తనువు
నిఘమార్థ నిధులున్న నెలవు

కోరిన మిగిలిన కోరికేమి
నిను కొనియాడు నిధుల పెన్నిధి తప్ప
చేరిన ఇక చేరువున్నదేమి
నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప

శృతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతి
ధృతి నీవు ధ్యుతి నీవు
శరణాగతి నీవు భారతి

శ్రీనాధ కవినాధ శృంగార
కవితా తరంగాలు నీ స్పూర్థులే
అల అన్నమాచార్య తలవాణి అలరించు
కీర్తనలు నీ కీర్తులే
త్యాగయ్య గళసీమ రావిల్లిన
అనంత రాగాలు నీ మూర్తులే

నీ కరుణ నెలకొన్న ప్రతి రచనం
జననీ భవ తారక మంత్రాక్షరం

శృతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతి
ధృతి నీవు ధ్యుతి నీవు
శరణాగతి నీవు భారతి

శృతి నీవు గతి నీవు
ఈ నా కృతి నీవు భారతి

ఆనతినీయరా హరా

ఆనతినీయరా హరా
సన్నుతి సేయగా సమ్మతినీయరా దొరా
సన్నిది చేరగా
ఆనతినీయరా హరా (2)

నీ ఆన లేనిదే గ్రహింప జాలునా
వేదాల వాణితో విరించి విశ్వ నాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా
ఆ యోగ మాయతో మురారి దివ్య పాలనం

వసుమతిలో ప్రతి క్షణం
పసుపతి నీ అధీనమై (2)
కదులునుగా సదా శివ

ఆనతినీయరా హరా
నినిస నిపనిపమగసగ
ఆనతినీయరా హరా
అచలనాధ అర్చింతునురా
ఆనతినీయరా

పమపని పమపని పమపని గమపని
సనిసగ సనిసగ సనిసగ పనిసగ
గమగస నిపమ గమగస మగసని

ఆనతి నీయరా

జంగమ దేవర సేవలు గొనరా
మంగళ దాయక దీవెనలిడరా
సాష్టాంగమున దండము చేతురా
ఆనతినీయరా

సానిప గమపనిపమ
గమగ పప పప
మపని పపప గగమ గస సస
నిసగ సస సస
సగ గస గప పమ పస నిస
గసని సగ సగ
సని సగ సగ
పగ గగ గగ సని సగ గ
గసగ గ
పద గస గ మ స ని పమగ గ

ఆనతి నీయరా

శంకర శంకించకురా
వంక జాబిలిని జడను ముడుచుకుని
విషపు నాగులను చంకనెత్తుకుని
నిలకడ నెరుగని గంగ నేలియై
వంక లేని నా వంక ఒక్క కడగంటి చూపు పడనీయవేమి
ఈశ్వరుడా ఇంక సేవించుకొందురా

ఆనతినీయరా

పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గ మపనిస మ పనిసగ ని స ప ని మ ప గ మ స
పప పమప నినిపమగస గగ
గమపని గ మపనిస మ పనిసగ ని స ప ని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గగ
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గ గ
గామపని గమపాని స మపానిసగని
స పని మ ప గ మ స గ మ
పప పమప నినిపమగస గ గా
గగ మమ పప నిగ తక తకిట తకధిమి
మమ పప నినిసమ తక తకిట తకధిమి
పపనినిసస గని తక తకిట తకధిమి
సపని మప గమ సగం
పప పమప నినిపమగస గ గ

రక్షషర శిక్ష దీక్ష ధ్రక్ష
విరూపక్ష నీ కృపావీక్షణాపేక్షిత
ప్రతీక్షణుపేక్ష ఛేయక
పరీక్ష చేయక
రక్ష రక్ష అను ప్రార్ధన వినరా

ఆనతినేయరా హరా

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ(2)
ముద్దు మురిపాలొలకు ముంగిళ్ళలోనా
మూడు పువ్వులారు కాయల్లు కాయ

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ

ఆరనైదోతనము ఏ చోటనుండు
అరుగులలికే వారి అరచేతనుండు(2)

తీరైన సంపద ఎవరింటనుండు (2)
దినదినము ముగ్గున్న ముంగిళ్ళనుండు

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ

కోటలో తులిసమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచే వారి కొంగు బంగారు(2)

గోవు మలచ్మికి కోటి దండాలు (2)
కోరినంత పాడి నిండు కడవల్లు

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ

మొగడు మెచ్చిన చాల కాపురం లోన
మొగలి పూల గాలి ముత్యాల వాన (2)

ఇంటి ఇల్లలికి ఎంత సౌభాగ్యం(2)
ఇంటిల్లిపాదికి అంత వైభొగం

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ
ముద్దు మురిపాలొలకు ముంగిళ్ళలోనా
మూడు పువ్వులారు కాయల్లు కాయ

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ

ఏ శ్వాసలో చేరితే

వేణుమాధవా    వేణుమాధవా

ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమవుతున్నదో(2)
ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమవుతున్నదో

ఆ శ్వాసలో నే లీనమై
ఆ మోవిపై నే మౌనమై
నిను చేరని మాధవా

ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమవుతున్నదో

మునులకు తెలియని జపములు
జరిపినదా మురళీ సఖి
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా

తనువున నిలువున తొలిచిన
గాయమునే తన జన్మకి
తరగని వరముల సిరులని తలచినదా

కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణు మాధవా నీ సన్నిధి

ఏ శ్వాసలో చేరితే
గాలి గాంధర్వమవుతున్నదో
ఏ మోవిపై వాలితే
మౌనమే మంత్రమవుతున్నదో

చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి
నలు వైపుల నడి రాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగులు సడి వినబడక హృదయానికి
అలజడితో అణువణువు తడబడదా

ఆ.. ఆ..ఆ ..ఆ...ఆ..

నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది నివేదించు నిమిషమిది
వేణు మాధవా నీ సన్నిధి


గ గ రి గ రి స రి గ గ రి రి స రి
గ ప ద సా స ద ప గ రి స రి
గ ప ద ప ద గ ప ద స ద ద ప గ రి గా
గ ప ద స స గ ప ద స స
ద ప ద రి రి ద ప ద రి రి
ద స రి గ రి స రి
గ రి స రి గ రి గ రి స రి గా
రి స ద ప గ గ గ పా పా
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప ద రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ
స రి గ ప ద రి గా


రాధికా హృదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి

నాదనామక్రియ : పాహి పాహి జగన్మోహన

నాదనామక్రియ : పాహి పాహి జగన్మోహన

పాహి పాహి జగన్మోహన కృష్ణ పరమానంద శ్రీకృష్ణ

దేవకీవసుదేవనందన కృష్ణ దివ్యసుందర శ్రీకృష్ణ
నందయశోదానందన కృష్ణ ఇందువదన శ్రీకృష్ణ
కుందరవదనకుటిలాలక కృష్ణ మందస్మిత శ్రీకృష్ణ
కింకిణిరచితఘణంఘణ కృష్ణ క్రీడాలోల శ్రీకృష్ణ
కుంకుమపంకవిపంకిల కృష్ణ గూఢమహిమ శ్రీకృష్ణ
చంచలఝళఝళనూపుర కృష్ణ మంజుళవేష శ్రీకృష్ణ
తరళితకుండలమండిత కృష్ణ తాండవలోల శ్రీకృష్ణ
ధిక్కృతసురరిపుమండల కృష్ణ దీనపాలక శ్రీకృష్ణ
సాధుసాధు నటవేష కృష్ణ సత్యసంధ శ్రీకృష్ణ
పాలితనారాయణతీర్ధ కృష్ణ పరమపావన శ్రీకృష్ణ (పాహి పాహి)

మోహన : నాలోన శివుడు గలడు

మోహన : నాలోన శివుడు గలడు

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
కోరితే సొకమ్ముబాపగలడు…((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడునాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడుపాపులను తుంగలో తొక్కగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడునాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడువరమిచ్చి గుండెలో పండగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడునాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడుఒద్దంటే రెంటినీ మూయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడునాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచీయగలడుతిక్కతో అసలు తుంచేయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడునాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడుదయతోటి తనలోన కలపగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడునాటకాలాడగలడు
తెరదించి మూటగట్టేయగలడు(౩)

మంత్ర పుష్పమ్


మంత్ర పుష్పమ్

యో’‌உపాం పుష్పం వేద’ పుష్ప’వాన్ ప్రజావా”న్ పశుమాన్ భ’వతి | చంద్రమా వా అపాం పుష్పమ్” | పుష్ప’వాన్ ప్రజావా”న్ పశుమాన్ భ’వతి | య ఏవం వేద’ | యో‌உపామాయత’నం వేద’ |ఆయతన’వాన్ భవతి |

అగ్నిర్వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యో”గ్నేరాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపోవా అగ్నేరాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’‌உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |

వాయుర్వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యో వాయోరాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై వాయోరాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’‌உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |

అసౌ వై తప’న్నపామాయత’నమ్ ఆయత’నవాన్ భవతి | యో’‌உముష్యతప’త ఆయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో’ వా అముష్యతప’త ఆయత’నమ్ |ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’‌உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |

చంద్రమా వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యః చంద్రమ’స ఆయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై చంద్రమ’స ఆయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’‌உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |

నక్ష్త్ర’త్రాణి వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యో నక్ష్త్ర’త్రాణామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై నక్ష’త్రాణామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’‌உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |

పర్జన్యో వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యః పర్జన్య’స్యాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై పర్జన్యస్యాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’‌உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |

సంవత్సరో వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యః సం’వత్సరస్యాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై సం’వత్సరస్యాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో”‌உప్సు నావం ప్రతి’ష్ఠితాం వేద’ | ప్రత్యేవ తి’ష్ఠతి |

కాంభోజి : ఇందరికీ అభయంబు లిచ్చు చేయి

రాగం: కాంభోజి రాగం

ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి ||

వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి |
కలికియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోళ్ళ వాడిచేయి ||

తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి |
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ||

పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి |
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ||

చందమామ రావో జాబిల్లి రావో

అన్నమయ్య కీర్తన చందమామ రావో

చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో ||

నగుమోము చక్కని యయ్యకు నలువ బుట్టించిన తండ్రికి
నిగమము లందుండే యప్పకు మా నీల వర్ణునికి |
జగమెల్ల నేలిన స్వామికి ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికిమా ముద్దుల మురారి బాలునికి ||

తెలిదమ్మి కన్నుల మేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికి చేతల కోడెకుమా కతల కారి ఈ బిడ్డకు |
కుల ముద్ధించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండు వొయ్యారికి నవ నిధుల చూపుల జూసే సుగుణునకు ||

సురల గాచిన దేవరకు చుంచు గరుడుని నెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి |
విరుల వింటి వాని యయ్యకు వేవేలు రూపుల స్వామికి
సిరిమించు నెరవాది జాణకు మా శ్రీ వేంకటేశ్వరునికి ||

షిరిడి సాయి బాబా ప్రాతఃకాల ఆరతి


షిరిడి సాయి బాబా ప్రాతఃకాల ఆరతి - కాకడ ఆరతి

1. జోడూ నియాకరచరణి ఠేవిలామాధా
పరిసావీ వినంతీ మాఝీ పండరీనాధా
అసోనసో భావా‌ఆలో - తూఝియాఠాయా
క్రుపాద్రుష్టిపాహే మజకడే - సద్గురూరాయా
అఖండిత అసావే‌ఇసే - వాటతేపాయీ
తుకాహ్మణే దేవామాఝీ వేడీవాకుడీ
నామే భవపాశ్ హాతి - ఆపుల్యాతోడీ

2.ఉఠాపాండురంగా అతా ప్రభాత సమయో పాతలా |
వైష్ణవాంచా మేళా గరుడ-పారీ దాటలా ||
గరూడాపారా పాసునీ మహా ద్వారా పర్యంతా |
సురవరాంచీ మాందీ ఉభీ జోడూని హాత్
శుకసనకాదిక నారదతుంబర భక్తాంచ్యాకోటీ
త్రిశూలఢమరూ ఘే‌ఉని ఉభా గిరిజేచాపతీ
కలియుగీచా భక్తానామా ఉభాకీర్తనీ
పాఠీమాగే ఉభీడోలా లావుని‌ఉ‌ఆజనీ

3.ఉఠా ఉఠా శ్రీసాయినాధగురుచరణకమల దావా
ఆధివ్యాది భవతాప వారునీ తారా జడజీవా
గేలీతుహ్మా సోడు నియాభవ తమర రజనీవిలయా
పరిహీ అఙ్యానాసీ తమచీ భులవియోగమాయా
శక్తిన అహ్మాయత్కించిత్ హీ తి జలాసారాయా
తుహ్మీచ్ తీతేసారుని దావా ముఖజనతారాయా
అఙ్ఞానీ అహ్మీకితి తవ వర్ణావీతవధోరవీ
తీవర్ణితాభా గలే బహువదనిశేష విధకవీ
సక్రుపహో‌ఉని మహిమాతుమచా తుహ్మీచవదవావా
ఆదివ్యాధిభవ తాపవారుని తారాజడజీవా
ఉఠా ఉఠా శ్రీసాయినాధగురుచరణకమల దావా
ఆదివ్యాధిభవ తాపవారుని తారాజడజీవా
భక్తమనిసద్భావ ధరునిజే తుహ్మా‌అనుసరలే
ధ్యాయాస్తవతే దర్శ్నతుమచే ద్వారి ఉబేఠేలే
ధ్యానస్ధా తుహ్మాస పాహునీ మన అముచేఘేలే
ఉఖడునీనేత్రకమలా దీనబంధూరమాకాంతా
పాహిబాక్రుపాద్రుస్టీ బాలకాజసీ మాతా
రంజవీమధురవాణీ హరితాప్ సాయినాధా
అహ్మిచ్ అపులేకరియాస్తవతుజకష్టవితోదేవా
సహనకరిశిలె ఇకువిద్యావీ భేట్ క్రుష్ణదావా
ఉఠా ఉఠా శ్రీసాయినాధగురుచరణకమల దావా
ఆదివ్యాధి భవతాపవారుని తారాజడజీవా

4.ఉఠా ఉఠా పాడురంగా ఆతా - దర్శనద్యాసకళా
ఝూలా అరుణోదయాసరలీ-నిద్రేచెవేళా
సంతసాధూమునీ అవఘే ఝూలేతీగోళా
సోడాశేజే సుఖ్ ఆతా బహుజాముఖకమలా
రంగమండపే మహాద్వారీ ఝూలీసేదాటీ
మన ఉ తావీళరూప పహవయాద్రుష్టీ
రాయిరఖుమాబాయి తుహ్మాయే ఊద్యాదయా
శేజే హాలవునీ జాగే కారాదేవరాయా
గరూడ హనుమంత హుభే పాహాతీవాట్
స్వర్గీచే సురవరఘే ఉని ఆలేభోభాట్
ఝూలే ముక్త ద్వారా లాభ్ ఝూలారోకడా
విష్ణుదాస్ నామ ఉభా ఘే ఉనికాకడ

5.ఘే‌ఉనియా పంచారతీ కరూబాబాసీ ఆరతీ
ఉఠా‌ఉఠాహో బాంధవ ఓవాళు హరమాధవ
కరూనియా స్ధిరామన పాహుగంభీరాహేధ్యాన
క్రుష్ణనాధా దత్తసాయి జాడొచిత్త తుఝేపాయీ
కాకడ ఆరతీ కరీతో! సాయినాధ దేవా
చిన్మయరూప దాఖవీ ఘే ఉని! బాలకలఘు సేవా ||కా||

6.కామక్రోధమదమత్సర ఆటుని కాకడకేలా
వైరాగ్యాచే తూవ్ కాఢునీ మీతో బిజివీలా
సాయినాధగురు భక్తి జ్వలినే తోమీపేటవిలా
తద్ర్వుత్తీజాళునీ గురునే ప్రాకాశపాడిలా
ద్వైతతమానాసునీమిళవీ తత్స్యరూపి జీవా
చిన్మయరూపదాఖవీ ఘే‌ఉనిబాలకలఘు సేవా
కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా
చిన్మయారూపదాఖవీ ఘే ఉని బాలకలఘు సేవా
భూ ఖేచర వ్యాపూనీ అవఘే హ్రుత్కమలీరాహసీ
తోచీ దత్తదేవ శిరిడీ రాహుని పావసీ
రాహునియేధే అన్యస్రధహి తూ భక్తాస్తవధావసీ
నిరసుని యా సంకటాదాసా అనిభవ దావీసీ
నకలేత్వల్లీ లాహీకోణ్యా దేవావా మానవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘుసేవా
కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘుసేవా
త్వదూశ్యదుందుభినేసారే అంబర్ హే కోందలే
సగుణమూర్తీ పాహణ్యా ఆతుర జనశిరిడీ ఆలే!
ప్రాశుని తద్వచనామ్రుత అముచేదేహబాన్ హరఫలే
సోడునియాదురభిమాన మానస త్వచ్చరణి వాహిలే
క్రుపాకరునీ సాయిమావులే దానపదరిఘ్యావా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘు సేవా
కాకడ ఆరతీకరీతో సాయినాధ దేవా
చిన్మయరూపదాఖవీ ఘే ఉని బాలకఘుసేవా.
భక్తీచియా పోటీబోద్ కాకడ జ్యోతీ
పంచప్రాణజీవే భావే ఓవాళు ఆరతీ
ఓవాళూ ఆరతీమాఝ్యా పండరీనాధా మాఝ్యాసాయినాధా
దోనీ కరజోడునిచరణీ ఠేవిలామాధా
కాయామహిమా వర్ణూ ఆతా సాంగణేకీతీ
కోటిబ్రహ్మ హత్యముఖ పాహతా జాతీ
రాయీరఖుమాబాయీ ఉభ్యా దోఘీదోబాహీ
మాయూరపించ చామరేడాళీతి సాయీంచ ఠాయి
తుకాహ్మణే దీపఘే ఉని ఉన్మనీతశోభా
విఠేవరీ ఉబాదిసే లావణ్యా గాభా
ఉఠాసాదుసంతసాదా ఆపులాలే హితా
జా‌ఈల్ జా‌ఈల్ హనరదేహ మగకైచా భగవంత
ఉఠోనియా పహటేబాబా ఉభా అసేవీటే
చరణతయాంచేగోమటీ అమ్రుత ద్రుష్టీ అవలోకా
ఉఠా‌ఉఠా హోవేగేసీచలా జ‌ఊరా‌ఉళాసీ
జలతిలపాతకాన్ చ్యారాశీ కాకడ ఆరతిదేఖిలియా
జాగేకరారుక్మిణీవరా దేవ అహేనిజసురాన్ త
వేగేలింబలోణ్ కరా-ద్రుష్టి హో ఈల్ తయాసీ
దారీబాజంత్రీ వాజతీ డోలు డమామే గర్జతీ
హోతసేకాకడారతి మాఝ్యా సద్గురు రాయచీ
సింహనాధ శంఖ బేరి ఆనందహోతోమహాద్వారీ
కేశవరాజ విఠేవరీ నామాచరణ వందితో
సాయినాధ గురుమాఝే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై
దత్తరాజ గురుమాఝే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
సాయినాధ గురుమాఝే ఆయీ
మజలా ఠావా ద్యావాపాయీ
ప్రభాత సమయీనభా శుభ రవీ ప్రభాపాకలీ
స్మరే గురు సదా అశాసమయీత్యాఛళే నాకలీ
హ్మణోనికరజోడునీకరు అతాగురూ ప్రార్ధనా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
తమా నిరసి భానుహగురుహి నాసి అఙ్ఞానతా
పరంతుగురు చీకరీ నరవిహీకదీ సామ్యతా
పున్ హాతిమిర జన్మఘే గురుక్రుపేని అఙ్ఞననా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
రవి ప్రగటహో ఉని త్వరితఘాల వీ ఆలసా
తసాగురుహిసోడవీ సకల దుష్క్రుతీ లాలసా
హరోని అభిమానహీ జడవి తత్పదీభావనా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
గురూసి ఉపమాదిసేవిధి హరీ హరాంచీ‌ఉణీ
కుఠోని మగ్ ఏ‌ఇతీ కవని యా ఉగీపాహూణి
తుఝీచ ఉపమాతులాబరవిశోభతే సజ్జనా
సమర్ధ గురుసాయినాధ పురవీ మనోవాసనా
సమాధి ఉతరోనియా గురుచలామశీదీకడే
త్వదీయ వచనోక్తితీ మధుర వారితీసోకడే
అజాతరిపు సద్గురో అఖిల పాతక భంజనా
సమర్ధ గురుసాయినాధపుర వీ మనోవాసనా
అహాసుసమయాసియా గురు ఉఠోనియా బైసలే
విలోకుని పదాశ్రితా తదియ ఆపదే నాసిలే
ఆసాసుత కారియా జగతికోణీహీ అన్యనా
అసేబహుతశాహణా పరినజ్యాగురూచీక్రుపా
నతత్ర్వహిత త్యాకళేకరితసే రికామ్యా గపా
జరీగురుపదాధరనీసుద్రుడ భక్తినేతోమనా
సమర్ధ గురుసాయినాధపుర వీ మనోవాసనా
గురోవినతి మీకరీ హ్రుదయ మందిరీ యాబసా
సమస్త జగ్ హే గురుస్వరూపచి ఠసోమానసా
గడోసతత సత్కృ‌అతీయతిహిదే జగత్పావనా
సమర్ధ గురుసాయినాధపుర వీ మనోవాసనా

11.ప్రమేయా అష్టకాశీఫడుని గురువరా ప్రార్ధితీజేప్రభాతి
త్యాంచేచిత్తాసిదేతో అఖిలహరునియా భ్రాంతిమినిత్యశాంతి
ఐసే హేసాయినాధేకధునీ సుచవిలే జేవియాబాలకాశీ
తేవిత్యాక్రుష్ణపాయీ నముని సవినయే అర్పితో అష్టకాశీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై

12.సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
జానాతుమనే జగత్ప్రసారా సబహీఝూట్ జమానా
జానాతుమనే జగత్ప్రసారా సబహీఝూట్ జమానా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
మై అంధాహూబందా ఆపకాముఝుసే ప్రభుదిఖలానా
మై అంధాహూబందా ఆపకాముఝుసే ప్రభుదిఖలానా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
దాసగణూకహే అబ్ క్యాబోలూ ధక్ గయీ మేరీ రసనా
దాసగణూకహే అబ్ క్యాబోలూ ధక్ గయీ మేరీ రసనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
సాయిరహం నజర్ కరనా బచ్చోకాపాలన్ కరనా
రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
తుమబీన నహీముఝే మాబాప్ భాయీ - రాం నజర్ కరో
మై అంధాహూ బందా తుమ్హారా - మై అంధాహూ బందా తుమ్హారా
మైనాజానూ,మైనాజానూ - మైనాజానూ - అల్లా‌ఇలాహి
రాం నజర్ కరో రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
తుమబీన నహీముఝే మాబాప్ భాయీ - రాం నజర్ కరో
రాం నజర్ కరో రాం నజర్ కరో
ఖాలీ జమానా మైనే గమాయా మైనే గమాయా
సాధీ‌అఖిర్ కా సాధీ‌అఖిర్ ఆ - సాధీ‌అఖిర్ కా కీయానకోయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
తుమబీన నహీముఝే మాబాప్ భాయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో
అప్ నేమస్ జిద్ కా జాడూగనూహై
అప్ నేమస్ జిద్ కా జాడూగనూహై
మాలిక్ హమారే మాలిక్ హమారే
మాలిక్ హమారే - తుం బాబాసాయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో , అబ్ మోరేసాయీ
రాం నజర్ కరో రాం నజర్ కరో

14.తుజకాయదే‌ఉ సావళ్య మీభాయాతరియో
తుజకాయదే‌ఉ సావళ్య మీభాయాతరియో
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
ఉచ్చిష్ట తులాదేణేహి గోష్ట నాబరి యో
ఉచ్చిష్ట తులాదేణేహి గోష్ట నాబరి
తూ జగన్నాధ్ తుజచే కశీరేభాకరి
తూ జగన్నాధ్ తుజచే కశీరేభాకరి
నకో అంతమదీయా పాహూ సఖ్యాభగవంతా శ్రీకాంతా
మధ్యాహ్నరాత్రి ఉలటోనిగే లిహి ఆతా అణచిత్తా
జహో ఈల్ తుఝూరేకాకడా కిరా ఉళతరియో
జహో ఈల్ తుఝూరేకాకడా కిరా ఉళతరి
అణతీల్ భక్త నైవేద్యహి నానాపరి - అణతీల్ భక్త నైవేద్యహి నానాపరీ
తుజకాయదే‌ఉ మిభాయా తరియో
యుజకాయదే‌ఉ సద్గురు మీభాయా తరీ
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ
మీదుబళి బటిక నామ్యా చిజాణ శ్రీహరీ.
శ్రీసద్గురు బాబాసాయీ హో - శ్రీసద్గురు బాబాసాయీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ - తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
మీ పాపిపతితధీమంతా - మీ పాపిపతితధీమంతా
తారణేమలా గురునాధా ఝుడకరీ - తారణేమలా సాయినాధా ఝుడకరీ
తూశాంతిక్షమేచామేరూ - తూశాంతిక్షమేచామేరూ
తుమి భవార్ణ విచేతారూ గురువరా
తుమి భవార్ణ విచేతారూ గురువరా
గురువరామజసి పామరా అతా ఉద్దరా
త్వరితలవలాహీ త్వరిత లలాహీ
మీబుడతో భవ భయ డోహీ ఉద్దరా
శ్రీ సద్గురు బాబాసాయీ హో - శ్రీ సద్గురు బాబాసాయీ హో
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
తుజవాచుని ఆశ్రయనాహీభూతలీ
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై
రాజాధిరాజయోగిరాజ పరబ్రహ్మ సాయినాధ్ మహరాజ్
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...